డిచ్పల్లి: నిబంధనలు పాటించని బి.ఎడ్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్
తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని బి.ఎడ్ కళాశాలల్లో అక్రమ ఫీజులు, సౌకర్యాల లేమిపై SFI, AISF, AIPSU, DSO సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. నిబంధనలు ఉల్లంఘించే కళాశాలల అఫిలియేషన్ రద్దు చేయాలని ఆడిట్ సెల్ డైరెక్టర్‌కు వినతిపత్రం అందించాయి.