దర్శి: చింతలపాలెం లో నూతన రామాలయం నందు విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవం
Darsi, Prakasam | Jun 27, 2026 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం చింతలపాలెం లో నూతనంగా రామాలయంలో విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్ట వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా దేవత యంత్ర విగ్రహాలు ప్రాణ ప్రతిష్ట కళారూపణ మహా పూర్ణహుతి హోమాలు నిర్వహించారు. ధ్వజస్తంభ ప్రతిష్ట లో భక్తులు గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం హోరెత్తింది. భాజా భజంత్రీలు మంగళ వాయిద్యాలు రామనామ స్మరణ తో భక్తులు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.