మార్కాపురం జిల్లా దోర్నాల మండల కేంద్రంలోని హోటల్ వద్ద వైసిపి జనసేన నాయకుల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. హోటల్ వ్యవహారమే వివాదానికి కారణమని తెలుస్తుంది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకోవడంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలను చదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.