మార్కాపురం: మెస్ చార్జీలు పెంచాలని జిల్లా కలెక్టర్ విజయ సునీతకు ఎస్ఎఫ్ఐ నాయకులు వినతి
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హాస్టల్ మెస్ ఛార్జీలు పెంచాలని జిల్లా కలెక్టర్ విజయ సునీతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు విజయ్ మాట్లాడుతూ జిల్లాలో సుమారు 70 కి పైగా ప్రభుత్వ హాస్టల్లో ఉన్నాయని 2020 నాటికి కొంత మొత్తంలో పెంచి కళాశాల హాస్టల్స్కు 1600 చిన్నపిల్లల హాస్టల్కు 1450 రూపాయలు ప్రతి విద్యార్థికి గతంలో మెస్ ఛార్జీలు పెంచిందన్నారు. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు ధరలు పెరిగాయి తప్ప మెస్ చార్జీలు పెంచలేదన్నారు. ప్రభుత్వం ఈ మధ్యకాలంలో పది పర్సెంట్ మాత్రమే మెజార్టీలు పెంచడం జరిగిందన్నారు.