దర్శి: దర్శిలో లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన ఎస్ఐ ఏడుకొండలు
Darsi, Prakasam | Jul 10, 2026 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్సై ఏడుకొండలు తెలిపారు. వివిధ రకాల కేసులలో రాజీ పడదగిన వారు ఈ కార్యక్రమాన్ని సద్వినియం చేసుకోవాలని తెలిపారు. రాజీమార్గమే రాజ మార్గమన్నారు. మండలంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పలు కేసుల నుండి విముక్తి కావాలని కోరారు.