కొండపి: పాత సింగరాయకొండలోని బావిలో మృతి చెందిన బీటెక్ విద్యార్థి మృతి పై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సుధీర్ కుమార్ వెల్లడి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామంలోని ఓ బావిలో గత నెల 30వ తేదీన బావిలో రాహుల్ అనే బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. హైదరాబాదులోని కాచిగూడ కు చెందిన రాహుల్ హైదరాబాదులో అదృశ్యమై సింగరాయకొండలో మృతి చెందాడు. తల్లితండ్రులు తమ కొడుకు మృతదేహాన్ని గుర్తించి కొడుకు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేయించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని ఎస్ఐ సుధీర్ కుమార్ తెలిపారు.