విశాఖపట్నం: తూర్పు నియోజకవర్గం 22వ వార్డులో కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం
తూర్పు నియోజకవర్గం 22వ వార్డులో వీఎంఆర్డీఏ ఛైర్మన్ ఎంవీ ప్రణవ్‌గోపాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అభ్యర్థులు గొలగాని మంగవేణి, మేయరు అభ్యర్థి ముక్కా శ్రావణిని గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఎంవీపీ కాలనీలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.