యర్రగొండపాలెం: తిరుమలగిరి కాలనీకి చెందిన ఆదిత్య అనే బాలుడు కనపడడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో తండ్రి వెంకటేశ్వర్లు ఫిర్యాదు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని తిరుమలగిరి కాలనీకి చెందిన చేవూరు ఆదిత్య అనే బాలుడు పదో తరగతి పూర్తి చేశాడు. ఇంటర్ చదువుకోమని చెప్పగా ఇష్టం లేక జూలై 7వ తేదీన తెల్లవారుజామున మూడు గంటలకు ఇంట్లో నుంచి బయటికి వెళ్లాడు. అప్పటినుంచి కనిపించడం లేదు ఎంత వెతికినా ఎక్కడ ఆచూకీ దొరకపోవడంతో బాలుడు తండ్రి వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్సై దేవకుమార్ తెలిపారు.