గిద్దలూరు: బేస్తవారిపేట మండలం పివిపురం గ్రామంలో పేకాట ఆడుతున్న ఐదు మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
మార్కాపురం జిల్లా బెస్తవారిపేట మండలం పివిపురం గ్రామంలో పేకాట ఆడుతున్న ఐదు మందిని శుక్రవారం అర్ధరాత్రి సమయంలో స్థానిక ఎస్సై రవీంద్రారెడ్డి అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రెండు ద్విచక్ర వాహనాలు రూ.1,53,00 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రవీంద్రారెడ్డి తెలిపారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని బెస్తవారిపేట మండల పరిసర ప్రాంతాలలో పేకాట ఆడుతున్నట్లు ఎవరైనా గుర్తిస్తే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.