కొండపి: సింగరాయకొండ లో గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధ దంపతులు మృతి, మరొకరికి గాయాలు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ 16 నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో వృద్ధ దంపతులు అల్లి సాహెబ్, నాగూర్ బి సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఇదే ఘటనలో వారి మనవడు నాగూర్ వలి తీవ్రంగా గాయపడగా అతనిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగాక వాహనం నిలపకుండా వెళ్ళిపోయింది. అయితే కంటైనర్ లారీ అయి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా వాహనాన్ని గుర్తిస్తామని ఎస్ఐ సుధీర్ కుమార్ తెలిపారు.