కొండపి: జనసేన ని సంచలన నిర్ణయం..ప్రకాశం జిల్లా జనసేన కార్యవర్గ సభ్యులను సస్పెండ్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ప్రకాశం జిల్లా జనసేన కార్యవర్గ సభ్యులను సస్పెండ్ చేస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం అమరావతి జనసేన కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం హెచ్చరించారు. గట్టిగా ఉన్నది 25 మందే కానీ 50కి పైగా గొడవలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ నాయకుల పై అసహనం వ్యక్తం చేశారు. అతి త్వరలో నూతన కార్యవర్గ సభ్యులను నియమిస్తామని తెలిపారు.