యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని పారిశుద్ధ్య కార్మికులు నిరసన
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో మేజర్ పంచాయతీ కార్మికులకు 17 నెలల నుంచి జీతాలు చెల్లించకపోవడంతో కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి జీతాలు ఇవ్వాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు ఇవ్వకపోతే తమ కుటుంబ పోషణ ఏ విధంగా జరుగుతుందని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని కోరారు.