మార్కాపురం: జిల్లా కేంద్రంలో విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు రామనారాయణరెడ్డి, రవికుమార్
మార్కాపురం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ విజయ సునీత ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.