యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో పలు ప్రాంతాలలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన సిఐ అజయ్ కుమార్
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని పలు ప్రాంతాలలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. కస్తూర్బా స్కూల్ సమీపంలోని కాలనీలో సిఐ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానస్పద వ్యక్తులు అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని ఒక ఆటో తోపాటు ఏడు బైకులను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి డ్రగ్స్ దుష్ప్రభావాలు ఆన్లైన్ గేమ్స్ మోసాల పై అవగాహన కల్పించారు.