మార్కాపురం: దళితపేటలలో సామాజిక అవసరాలు మౌలిక సదుపాయాలు కల్పించాలి : కెవిపిఎస్
మార్కాపురం జిల్లా కేంద్రంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సభలో కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బి.రఘురాం మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో సామాజిక ఉద్యమం భారీ ఎత్తున చేపడుతున్నట్లు తెలిపారు. మహానుభావుల చిత్రపటాలకు విగ్రహాలకు పూలదండలేసి దండాలు పెట్టడం కాదు దళితపేటలలో సామాజిక అవసరాలు మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు దృష్టి పెట్టాలన్నారు