దర్శి: వాతావరం గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు
Darsi, Prakasam | Apr 11, 2026 ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతవరం గ్రామంలో కలెక్టర్ రాజాబాబు శుక్రవారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలో సిసి రోడ్లు వేయాలని డ్రైనేజీ కాలువల నిర్మించాలని కోరారు. గ్రామ సమీపంలో ఉన్న చెరువుకు దర్శి కెనాల్ నుంచి నీటిని సరిపడా చేయాలనీ అడిగారు. సమస్యలన్నిటిని అధ్యయనం చేసి పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.