గిద్దలూరు: గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న సర్ సర్వే కార్యక్రమంలో పాల్గొని పరిశీలించిన కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో సర్ సర్వే కార్యక్రమంలో కలెక్టర్ విజయ సునీత ఆదివారం పాల్గొని పరిశీలించారు. ఓటర్ల వద్దకు వెళ్లి సర్వే పూర్తి చేసుకోవడం ఎంత అవసరమో వారికి వివరించి చెప్పారు. అలానే సర్వే శాతం చాలా తక్కువగా ఉందని వేగంగా సర్వే పూర్తి చేయాల్సిన బాధ్యత నిర్దేశించిన సమయం ప్రకారం పూర్తి చేయాల్సిన బాధ్యత బిఎల్ఓ లపై ఉందని కలెక్టర్ విజయ సునీత అన్నారు.