దర్శి: దర్శి మండలంలో బిఎల్వోలు ఇంటింటికి సర్వే చేపట్టినట్లు వెల్లడించిన ఎలక్షన్ డిటి దేవప్రసాద్
Darsi, Prakasam | Jun 16, 2026 ప్రకాశం జిల్లా దర్శి మండలంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా బిఎల్ఓలతో సర్వే చేపట్టినట్లు ఎలక్షన్ డిటి తలారి దేవప్రసాద్ తెలిపారు. ఇంటింటికి వెళ్లి ఓట్లను వెరిఫికేషన్ చేసి సమగ్ర ఓటర్ లిస్ట్ తయారు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే బీఎల్ఓ లకు శిక్షణ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సర్వే జూలై 14 వ తేదీ వరకు జరుగుతుందన్నారు. ప్రజలు బిఎల్ఓ లకు సహకరించాలని కోరారు.