యర్రగొండపాలెం: బలిజ పల్లె గిరిజన గూడెంలో నిరుపయోగంగా ఉన్న మల్టీపర్పస్ భవనం
మార్కాపురం జిల్లా దోర్నాల మండలం బలిజపల్లి గిరిజన గూడెంలో ఐటీడీఏ నిధులతో మల్టీపర్పస్ భవనం నిర్మించారు. కానీ నేటి వరకు ప్రారంభానికి నోచుకోకపోవడంతో మూతపడి ఉంది. గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు ఇతర సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో నిర్మించిన ఈ భవనాన్ని వైద్య శాఖకు అప్పగించినప్పటికీ ఇప్పటివరకు వినియోగం లోకి తీసుకురాలేదు. నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్న తలుపులు తెరవకపోవడంతో ప్రజాధనం వృధా అవుతుందని స్థానికులు విమర్శించారు.