కొండపి: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు వాహన డ్రైవర్లకు ఫేస్ వాష్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పోలీసులు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ప్రతి రోజు అర్ధరాత్రి ఫేస్ వాష్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంగళవారం తెలిపారు. జాతీయ, మరియు రాష్ట్రీయ రహదారులపై వాహన డ్రైవర్ల కు చల్లటి నీటితో మొహాన్ని కడిగించిన అనంతరం వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వంద కిలోమీటర్ల కు ఒకసారి కనీసం 15 నిమిషాలు విశ్రాంతి తీసుకొని తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు వాహన డ్రైవర్లకు తెలిపారు.