గిద్దలూరు: కొమరోలు మరియు గిద్దలూరు మార్గాల మధ్య వేగంగా జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు, హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మరియు కొమరోలు మార్గాల మధ్య రహదారి విస్తరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. గతంలో ఉన్న సింగల్ రోడ్డులో ప్రయాణించేందుకు వాహనదారులు తీవ్రవస్తులు పడ్డారు. కోటిన్నరకు పైగా నిధులు వెచ్చించి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. రోడ్డు విస్తరణ అనంతరం వాహనదారుల సమయం ఆదా అవుతుందని వాహనదారులు చెబుతున్నారు. దెబ్బతిన్న ఈ రహదారిలో ప్రయాణించేందుకు తీవ్రవస్తులు పడుతున్నామని వేగంగా రహదారి పనులు జరుగుతుండటం వల్ల సమస్యలు తొలగుతాయని వాహనదారులు అన్నారు.