రాయదుర్గం: జక్కలవడికి లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మంటలు, తప్పిన పెను ప్రమాదం
కణేకల్లు మండలం జక్కలవడికి శివారులో ఆదివారం మధ్యాహ్నం విద్యుత్ వైర్ల షార్ట్ సర్క్యూట్‌తో కంపచెట్లు, చెత్తకు నిప్పంటుకుంది. గాలులకు మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలార్పడంతో గడ్డివాములు, ఇళ్లకు ప్రమాదం తప్పింది. వేలాడుతున్న వైర్లపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వైర్లు సరిచేయాలని కోరారు.