ఆత్మకూర్: హన్మకొండ: పాడి గేదెలను పరిశీలించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన పాడి గేదెలను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పరిశీలించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, దామెరలో ఇందిరా మహిళా డైరీ ద్వారా 40 వేల కుటుంబాలకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని ఆయన తెలిపారు.