దర్శి: హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించిన కాంగ్రెస్ పార్టీ దర్శి ఇన్చార్జి వెంకటకృష్ణారెడ్డి
Darsi, Prakasam | Jun 17, 2026 రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ ఇన్చార్జి కృష్ణారెడ్డి విమర్శించారు. దొనకొండలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రజలు తాగునీరు సాగునీరు ఉపాధి గిట్టుబాటు ధరలు వంటి అనేక సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. అమలు కాలేదు అన్నారు