దర్శి: ఉపాధి హామీ పని కార్మికులకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం పై అవగాహన
Darsi, Prakasam | Apr 17, 2026 ప్రకాశం జిల్లా ముళ్ళమూరు మండలం మారెళ్ళ గ్రామపంచాయతీ పరిధిలోని గంగన్న పాలెం లో ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తక్కువ ప్రీమియంతో జీవిత బీమా సౌకర్యం పొందవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా బీమా పథకం ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో కెనరా బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.