రాయదుర్గం: తక్షణమే మద్యం బెల్టుషాపులు రద్దు చేయాలి : కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి
కూటమి ప్రభుత్వం వాగ్దానాలను విస్మరించిందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు. రాయదుర్గంలో ఆయన మాట్లాడుతూ బెల్టు షాపుల వల్ల యువత మద్యానికి బానిసవుతున్నారని, వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాత సుఖీభవ కింద ఇప్పటివరకూ రూ.60 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.14 వేలే ఇచ్చారన్నారు. ఉపాధి హామీని నీరుగార్చారని, దీనివల్ల వలసలు పెరిగాయన్నారు. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ పాల్గొన్నారు.