కొండపి: సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో పర్యటకుల సందడి, అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకల బీచ్లో ఆదివారం సెలవు కావడంతో పర్యాటకులు సందడి చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నలుమూలల నుంచి తరలివచ్చారు. సముద్ర కెరటాల్లో స్నానాలు చేసి ఆనందంగా గడిపారు. చిన్నారులు కెరటాలతో ఇసుక తిన్నెలపై ఆటలాడుకున్నారు. సముద్ర తీరం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మెరైన్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.