దర్శి: లక్కవరం గ్రామంలో ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయాలని రైతులు విజ్ఞప్తి
Darsi, Prakasam | Apr 17, 2026 ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం లక్కవరం గ్రామంలో ట్రాన్స్ఫారంలో దొంగతనాలకి గురి కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి మూడవ తేదీన ట్రాన్స్ఫారం దొంగతనం జరిగిందని ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయడం జరిగిందన్నారు. కానీ ఇంతవరకు ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయలేదని దీంతో పంటలు పూర్తిగా నష్టపోతున్నామని వారు వాపోయారు. ట్రాన్స్ఫారంలు దొంగతనానికి గురవుతుంటే రైతులంతా కాపలాగా పొలాల వద్ద నిద్రపోతున్నారని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.