కొండపి: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో లాడ్జిలను ఆకస్మిక తనిఖీ చేసిన పోలీసులు, పూర్తి వివరాలు సేకరించాలని నిర్వాహకులకు ఆదేశాలు
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో సోమవారం పోలీసులు లార్జిలను ఆకస్మికంగా తనిఖీ చేశారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించకుండా కొత్త వ్యక్తులకు గదులను అద్దెకిచ్చే సమయంలో పూర్తి వివరాలను సేకరించాలని పోలీసులు తెలిపారు. ఎవరన్నా అనుమానస్పదంగా అనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అసాఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులకు నిర్వాహకులు సహకరించాలని కోరారు.