గిద్దలూరు: గిద్దలూరు, నంద్యాల నల్లమల అటవీ ప్రాంతంలో నిలిచిపోయిన రాకపోకలు, రోడ్డుకు అడ్డంగా పడ్డ లారీ వల్ల ట్రాఫిక్ స్తంభన
నంద్యాల మార్కాపురం జిల్లాల మధ్య రాకపోకలు స్తంభించాయి. శనివారం ఉదయం ఓ లారీ అదుపుతప్పి అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై అడ్డుగా పడటంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. నంద్యాల నుంచి గిద్దలూరు.. గిద్దలూరు నుంచి నంద్యాల వైపు వెళ్లే వాహనాలు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి. సమాచారాన్ని అందుకున్న నంద్యాల, గిద్దలూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న లారీని తొలగించి ట్రాఫిక్ ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు రెండు గంటల నుంచి ట్రాఫిక్ నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది.