రాయదుర్గం: పట్టణంలో 5 వ రోజుకు చేరుకున్న అగ్నిమాపక వారోత్సవాలు
రాయదుర్గం పట్టణంలోని గ్యాస్ గోడౌన్ లు, పెట్రోలు పంపుల వద్ద అగ్నిమాపక సిబ్బంది ప్రయోగాత్మకంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గోడౌన్ లు, పెట్రోల్ పంపుల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండి అగ్ని ప్రమాదాల సమయంలో అగ్ని నిరోధక పరికరాలు వాడి మంటలు ఆర్పేందుకు సన్నద్దంగా ఉండాలని వివరించారు. ఇన్చార్జ్ ఫైర్ ఆఫీసర్ శ్రీకాంత్ నేతృత్వంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.