కొండపి: సింగరాయకొండ మండలం పాలేరు పాయలో చేపల వేటకు వెళ్లి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి, దర్యాప్తు చేస్తున్న స్థానిక పోలీసులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాలేరు పాయలో చేపల వేటుకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. మృతుడు పల్లెపాలెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుగా పోలీసులు గుర్తించారు. తెల్లవారుజామున చేపల వేటకు వెళ్లి మృతిచెందగా కుటుంబ సభ్యులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.