మార్కాపురం: రాయవరం గురుకుల పాఠశాలలో విద్యార్థినిల సామర్థ్యాలను పరీక్షించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో జిల్లా కలెక్టర్ విజయ సునీత విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రోడ్లు బాగు చేయించాలని పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నాలుగు రోజులలో సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆమె సూచించారు. అనంతరం అంగన్వాడి కేంద్రం, గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థినీలతో మాట్లాడి వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. విద్య సామర్థ్యాలను పరీక్షించి సంతృప్తిని వ్యక్తం చేశారు