యర్రగొండపాలెం: పొలాల చెరువు మండలం ఐటీ పురం గ్రామంలో జల ధార జల హారతి కార్యక్రమం
మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం ఐటివరం గ్రామంలో జల ధార జల హారతి కార్యక్రమం నిర్వహించారు. టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్సన్ బాబు ఆదేశాల మేరకు స్థానిక నాయకులు ఉపాధి హామీ కూలీలకు జల ధార జల హారతి కార్యక్రమం పై అవగాహన కల్పించారు. చెరువులలో పూడిక తీసి నీటిని నిలువ చేయడం వల్ల భూగర్భ జలం పెరుగుతుందన్నారు. దీనివల్ల బోర్లకు నీళ్లు వస్తాయని నీటి సమస్య తీరుతుందని వారు వారికి అవగాహన కల్పించారు.