గిద్దలూరు: ఈనెల 18వ తేదీ నుంచి జరిగే మహానాడు కార్యక్రమానికి కార్యకర్తలు తరలిరావాలని విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గురువారం రాత్రి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈనెల 18వ తేదీ నుంచి నెల్లూరు జిల్లాలో జరిగే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి దాదాపు 5 లక్షల మంది కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉందని ప్రతి ఒక్క కార్యకర్త ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరారు.