గిద్దలూరు: కంభంలో సర్ కార్యక్రమంలో ఓటు రీ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన టిడిపి నాయకులు
మార్కాపురం జిల్లా కంభంలో సర్ కార్యక్రమంలో భాగంగా ఓటు రి వెరిఫికేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని టిడిపి నాయకులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఇంటింటికి వెళ్లి ప్రజలకు ఓటు రివ్యూ రేపిటేషన్ ఎలా చేసుకోవాలో వారికి వివరించి చెప్పారు. ఈనెల 14వ తేదీతో సమయం ముగుస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వెరిఫికేషన్ చేసుకోవాలని లేదంటే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని నాయకులు ప్రజలను హెచ్చరించారు. అలానే ఫామ్ ఎలా ఫిలప్ చేసుకోవాలో సూచించారు.