దర్శి: దర్శి పట్టణంలో విపరీతమైన గాలులు ఉరుములతో భారీ వర్షం
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో మధ్యాహ్నం తర్వాత భారీ వర్షం కురిసింది. విపరీతమైన గాలులు ఉరుములు మెరుపులతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీంతో విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. ఉదయం నుంచి విపరీతమైన ఎండలో అల్లాడిన స్థానికులకు ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురవడంతో ఊపిరి పీల్చుకున్నారు.