విశాఖపట్నం: సింహాచలం అన్నప్రసాద పథకానికి 5.32 లక్షల భారీ విరాళం
సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి శాశ్వత అన్నప్రసాద పథకానికి విశాఖపట్నంకు చెందిన మన్నె వర్షిణి 5,32,000 రూపాయల విరాళాన్ని అందించారు. ఈ మేరకు ఆలయ కార్యనిర్వహణాధికారికి చెక్కును అందజేయగా, ఆలయ అధికారులు ఆమెను సత్కరించారు.