విశాఖపట్నం: విశాఖలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక: జీవీఎంసీ కీలక ప్రకటన
విశాఖపట్నం జీవీఎంసీ పరిధిలోని 10 జోన్లలో సోమవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నారు. పారిశుద్ధ్యం, నీటి సరఫరా, ఇంజనీరింగ్, రెవెన్యూ సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేయవచ్చు.