దర్శి: దర్శిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉగ్రదాడిని ఖండిస్తూ శాంతి ర్యాలీ నిర్వహణ
Darsi, Prakasam | Apr 29, 2025 దర్శిలో సోమవారం రాత్రి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఇటీవల జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ఈ ర్యాలీ ప్రధాన వీధుల నుంచి స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్దకు చేరుకున్నారు. 'మా దేహం మొక్కలైనా ఈ దేశమును ముక్కలు కానివ్వకండి' అని నినాదాలు చేశారు. శాంతిభద్రతలను కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, భారతీయులంతా ఏకం కావలసిన సమయం ఆసన్నమైనదని అన్నారు.