దర్శి: దర్శి పట్టణంలో పర్యటించిన ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి
Darsi, Prakasam | Apr 28, 2025 దర్శి పట్టణంలో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి సోమవారం పర్యటించారు.ఈ పర్యటనలో భాగంగా ఇటీవల ప్రమాదంలో గాయపడిన మరియు అనారోగ్యంతో బాధపడుతున్న వైసిపి కార్యకర్తలను ఆయన పరామర్శించారు. అదేవిధంగా ఇటీవల ముండ్లమూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళలకు వైద్య ఖర్చులు నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్శి నియోజకవర్గంలోని ప్రజలకు ఏ ఆపద వచ్చిన తనకు తెలపాలని వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు.