మార్కాపురం: రైతులు ఆదాయాన్ని ఇచ్చే పట్టు సాగుపై ఆసక్తి పెంచుకోవాలని పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ విజయ సునీత
మార్కాపురం జిల్లా కేంద్రంలోని పట్టు పరిశ్రమ కార్యాలయంలో పట్టు పరిశ్రమ సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ విజయ సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు సాధారణ పంటలతో పాటు ఆదాయాన్నిచ్చే పట్టు సాగు పై ఆసక్తిని పెంచుకోవాలని ఆ దిశగా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సబ్సిడీ ఇస్తున్నాయని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.