యర్రగొండపాలెం: ఎర్రగొండపాలెం లో బిఎల్ఎ లకు సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని పలు గ్రామాలలో బి ఎల్ ఏ లతో కలిసి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన సర్ గురించి వివరించి ఈ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో బి ఎల్ ఏ లు ఎదుర్కొంటున్న సమస్యపై అవగాహన కల్పించారు. అనంతరం పార్టీ అందుబాటులోకి తీసుకువచ్చిన మై బూత్ మై ఓటర్ యాప్ ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని బిఎల్ఎ లకు సూచించారు. వైసిపి పార్టీ మద్దతుదారుల ఓట్ల తొలగించకుండా బిఎల్ఎ లు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.