గిద్దలూరు: కొమరోలు మండలంలో ఏప్రిల్ 20వ తేదీ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు వెల్లడి
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఏప్రిల్ 20వ తేదీ సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఆదివారం ఏఈ శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. కసినపల్లె విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని హనుమంతరాయుని పల్లె గ్రామానికి ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు గృహ వ్యవసాయ సంబంధిత విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు శ్రీనివాసులు అన్నారు. మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలన్నారు.