గిద్దలూరు: రుతుపవనాల ఆగమనంతో పాటు బంగాళాఖాతంలో అల్ప ద్రోని వల్ల మార్కాపురం జిల్లాలో విస్తారంగా వర్షాలు,ఆనందం వ్యక్తం చేస్తున్న రైతు
రుతుపవనాల ఆగమనంతో పాటు బంగాళాఖాతంలో అల్ప ద్రోని వల్ల మార్కాపురం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గిద్దలూరు మార్కాపురం నియోజకవర్గాలతో పాటు కనిగిరి, ఎర్రగొండపాలెం ప్రాంతాలలో కూడా అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులు కొంతవరకు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అయితే వర్షపాతం మరింత నమోదు అయితే రైతులకు ఈసారి పంటలు వేసుకునేందుకు డోకా లేకుండా ఉంటుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.