గిద్దలూరు: అర్ధవీడు మండలం మొహిద్దిన్ పురం గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, ఆరుగురికి గాయాలు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం మొహిద్దిన్ పురం గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఘర్షణలు ఇరు వర్గాలకు చెందిన ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారందరిని కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పాత గొడవల నేపథ్యంలో ఘర్షణ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.