కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గంలో శ్రీ రామిరెడ్డి తాగునీటి పథకం పైపులను బంద్ చేసి ఆందోళనకు దిగిన కార్మికులు
కళ్యాణదుర్గం లో శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులు మరోసారి ఆందోళనకు దిగారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం పైప్ లైన్లను కార్మికులు మూకుమ్మడిగా వెళ్లి బంద్ చేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడారు. 9 నెలలుగా జీతాలు, పీఎఫ్ ఇవ్వలేదన్నారు. గతంలో సమ్మె చేసిన కాలానికి సంబంధించిన జీతాలు కూడా ఇవ్వలేదన్నారు. జీతాలు ఇచ్చేవరకు ఆందోళన విరమించేదిలేదన్నారు. వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.