దర్శి: పేకాట శిబిరం పై దొనకొండ పోలీసులు దాడి నలుగురు అరెస్ట్
Darsi, Prakasam | Jul 14, 2026 ప్రకాశం జిల్లా దొనకొండ మండలం దొండపాడు గ్రామంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి నిర్వహించారు. దాడిలో పేకాట ఆడుతున్న నలుగురిని పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న 9250 నగదు రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసుల నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. మండలంలో జూదం చట్ట వ్యతిరేక కార్యకలాపాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.