మార్కాపురం: ఇంధనం పొదుపులో భాగంగా పొదిలిలో ప్రత్యేక కార్యక్రమానికి బస్సులో వెళ్లిన ఎమ్మెల్యే నారాయణరెడ్డి, కలెక్టర్ విజయ సునీత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంధనం పొదుపు చేయాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో పొదిలిలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కలెక్టర్ విజయ సునీత సంబంధిత జిల్లా అధికారులు ప్రత్యేక బస్సులు వెళ్లారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల మేరకు వాహనాల సంఖ్యను తగ్గించి ఇంధన పొదుపు చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే, కలెక్టర్ అన్నారు.