యర్రగొండపాలెం: పుల్లలచెరువు కస్తూర్బా గాంధీ విద్యాలయంలో పరీక్ష ఫలితాలలో ప్రతిభ చాటిన ఇంటర్ విద్యార్థినిలు
మార్కాపురం జిల్లా పుల్లల చెరువు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో చదువుతున్న ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని బేబీ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సుజాత ఇంటర్ పరీక్ష ఫలితాలలో ప్రతిభ చాటారు. ఇద్దరు బైపిసి గ్రూపులో బేబీ 470 కి గాను 438 మార్కులు, సుజాత 1000 మార్కుల గాను 979 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ సందర్భంగా వారిని అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు ప్రత్యేకంగా అభినందించారు.